జీ7 సదస్సుకు రండి.. ప్రధాని మోడీకి బ్రిటన్ పీఎం ఆహ్వానం

by  |
జీ7 సదస్సుకు రండి.. ప్రధాని మోడీకి బ్రిటన్ పీఎం ఆహ్వానం
X

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ7 సదస్సుకు హాజరవ్వాలని బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు. ఈ ఏడాది జీ7 సదస్సుకు యూకే అధ్యక్షత వహిస్తున్నది. కరోనానంతర పరిణామాలు, ఆర్థిక సవాళ్లను ఏకమై ఎదుర్కోవడానికి ఈ సదస్సును వినియోగించుకోవాలని యూకే పేర్కొంది. ఏడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌ల సదస్సును జీ7 మీట్‌గా పేర్కొంటారు. జూన్ 13 నుంచి 15 మధ్య జరిగే ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను అతిథులుగా యూకే ఆహ్వానిస్తున్నది. రెండేళ్ల తర్వాత మళ్లీ భౌతికంగా అందరూ హాజరవ్వనున్నారని, కార్న్‌వాల్‌లో ఈ సదస్సు జరగబోతున్నదని ఓ ప్రకటనలో వివరించింది. ఈ సదస్సుకు ముందే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటించే అవకాశమున్నదని తెలిపింది. ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాన్సన్ ముఖ్య అతిథిగా రావలసి ఉన్నది. కానీ, యూకేలో కొత్త స్ట్రెయిన్ కలకలం రేగడం, లాక్‌డౌన్ విధించడం లాంటి కారణాలతో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు బోరిస్ జాన్సన్ తెలిపారు.

Next Story

Most Viewed