స్టూడెంట్‌పై బాక్సింగ్ కోచ్ అత్యాచారం

by  |
స్టూడెంట్‌పై బాక్సింగ్ కోచ్ అత్యాచారం
X

దేశంలో రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నారు. ఇలాంటి ఘటనల నుంచి తమను తాము రక్షించుకోవడానికి బాక్సింగ్, కుంగ్ ఫూ, మర్షల్ ఆర్ట్స్ వంటి విద్యలపై కొందర మహిలలు ఆసక్తి చూపుతున్నారు. కానీ వారికి అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. కోచింగ్ ఇవ్వాల్సిన కోచ్ అమ్మాయిలపై అత్యాచారానికి ఒడిగడుతున్నాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. సందీప్ మాలిక్ అనే ఓ బాక్సర్ ఢిల్లీలోని సోనాపేట్‌లో బాక్సింగ్ అకాడమీ ప్రారంభించాడు. అనేక మంది అందులో చేరి కోచింగ్ తీసుకుంటున్నారు. గత నెల ఫిబ్రవరిలో కోల్‌కతాలోని బెంగాల్‌లో 2020 మూడో క్లాసిక్ బాక్సింగ్ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొనేందుకు తన టీమ్‌తో కలిసి రైలులో బయల్దేరాడు. రాత్రి సమయం కావడంతో అందరూ నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో తన టీమ్‌లోని ఒక అమ్మాయిని నిద్ర లేపి ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు. బాక్సింగ్‌ గురించి ఏవైనా చెబుతాడేమోనని ఆమె ఆయనతో వెళ్లింది. తనకోసం ప్రత్యేకంగా కేటాయించుకున్న క్యాబిన్‌లోకి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. ఎవరూ నమ్మరనీ.. పైగా బాక్సింగ్ కెరీరే లేకుండా చేస్తానని బెదిరించాడు. దీంతో అమాయకురాలైన ఆ బాధితురాలు ట్రైన్‌లో అలాగే రాత్రంతా ఏడుస్తూ ప్రయాణించింది. కోల్‌కతా వెళ్లాక కూడా ఆమెను ఒంటరిగా తీసుకెళ్లీ కెరీర్ గురించి మట్లాడుతూ.. బెదిరింపులకు గురిచేస్తూ మళ్లీ మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనోవేధనకు గురైన అమ్మాయి. తిరిగి ఢిల్లీకి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ర్టం కాని రాష్ట్రంలో తాను కోచ్‌ను ఎదిరించలేకపోయానని, ఢిల్లీకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రైల్వే పోలీసులకు కేసును అప్పగించారు. కేసు టేకప్ చేసిన రైల్వై పోలీసులు వెంటనే కోచ్ సందీప్ మాలిక్‌ని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.

Tags: Boxing coach, rapes student, railway police, kolkatha, train, Boxing Academy, delhi

Next Story

Most Viewed