వాటిని.. ఊపిరి పీల్చుకోనివ్వండి : భూమి

by  |
వాటిని.. ఊపిరి పీల్చుకోనివ్వండి : భూమి
X

దిశ, వెబ్ డెస్క్: మొక్కలు లేకపోతే సమస్త మానవాళికి మనుగడే లేదు. అందుకే ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షించాలని శస్త్రవేత్తలు పదే పదే చెబుతుంటారు. అంతేగాకుండా అంతరించిపోతున్న అడవులను సంరక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ద్వారా ఛాలెంజ్‌‌లు విసురుతూ.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్‌లతో మొక్కలు నాటించారు. కాగా తాజాగా ప్రకృతి కాపాడటం కోసం బాలీవుడ్ అందాల భామ భూమి పడ్నేకర్‌ ‘క్లైమేట్ వారియర్’ అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం ప్రజలు తమ రోజువారీ అలవాటు లాగా మార్చుకోవాలని ఇన్‌స్టాగ్రాం ద్వారా తన సందేశాన్నిషేర్ చేశారు. అంతకముందు దేశంలో మొక్కలు ఎక్కువ సంఖ్యలో నాటుతూ, సంరక్షిస్తున్న ప్రాంతాల చిత్రాలను పోస్ట్‌ చేశారు. ‘మొక్కలను పెరుగనివ్వండి.. ఊపిరి పీల్చుకోనివ్వండి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దేశంలో సహజ వృక్షజాలాన్ని పెరగనివ్వండి అనే అర్థంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనమందరం కలిసి సంతోషకరమైన కుటుంబంగా నివసించే స్వచ్ఛమైన, అతిపెద్ద ఆకుపచ్చ ప్రపంచాన్ని ఊహించుకోండి. ప్రకృతి మనకు ప్రసాదించే వాటిని రక్షించడం చాలా ముఖ్యం’ అని రాశారు. కాగా, పడ్నేకర్‌ గతేడాది ‘క్లైమేట్ వారియర్’ అనే పేరుతో ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed