భారత్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ విడుదల చేసిన బీఎమ్‌డబ్ల్యూ!

by  |
bmw
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోడల్ బీఎమ్‌డబ్ల్యూ 9ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్ పూర్తిగా తయారీ చేసి దిగుమతి అయిన వాహనమని, దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్నటువంటి బీఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్‌లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రారంభం నాటికి వీటి డెలివరీలను ప్రారంభించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ 9 మోడల్‌ను రూ. 1,15,90,000(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. సరికొత్త ఫ్లాగ్‌షిప్ టెక్నాలజీ విభాగంలో తెచ్చిన ఈ కారు మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే వంటి రంగుల్లో లభిస్తుందని కంపెనీ వివరించింది.

ఇక, దేశంలోని 35 నగరాల్లో ఉన్న కంపెనీ డీలర్ నెట్‌వర్క్‌ల వద్ద ఫాస్ట్ ఛార్జర్లతో లగ్జరీ విభాగం కింద అత్యుత్తమ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా స్పష్టం చేసింది. ఫ్లష్ డోర్ ఓపెనర్, ఇంటిగ్రేటెడ్ స్పీకర్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యూ హెడ్-అప్ డిస్‌ప్లే ప్రొజెక్టర్, సెన్సార్లు, రాడార్ టెక్, కెమెరా సహా అనేక అధునాతన ఫీచర్లను ఇందులో అందించామని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed