రోడ్డు విస్తరణ విషయంలో మంత్రిపై తీవ్ర విమర్శలు…

by  |
road
X

దిశ, జవహర్ నగర్: కార్పొరేషన్ పరిధిలో సుమారు మూడు లక్షల జనాభా ఉంటే కేవలం 55 ఫీట్ల ప్రధాన రోడ్డు విస్తరణ చేపట్టడాని నిరసిస్తూ.. శనివారం బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ప్రధాన రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ పాలకులు, అధికారులు మత్తు నిద్రలో ఉండి, రోడ్డు కుదింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రధాన రోడ్డు గుండా ఉన్న బడా వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక పాలక వర్గం వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు.

కార్పొరేషన్‌ను పట్టణంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పి, అమాయక ప్రజలను మోసం చేస్తూ.. ప్రధాన రోడ్డును తగ్గిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్పష్టత లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్డు విస్తరణ పనులను చేపట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి వెంటనే 100 ఫీట్ల ప్రధాన రోడ్డు విస్తరణ చేపట్టాలని.. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు.

Next Story

Most Viewed