ఆరోజు యాదృచ్చికంగా కలిసాం : సుజనా చౌదరి

by  |
ఆరోజు యాదృచ్చికంగా కలిసాం : సుజనా చౌదరి
X

దిశ, వెబ్‌ డెస్క్: హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రహస్యంగా సమావేశం అయిన విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో రాష్ర్టంలో దుమారం రేగుతోంది. వీరు రహస్యంగా సమావేశం కావడం వెనుక అసలు నిజం బయటపెట్టాలని ఇప్పటికే అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాక్‌డౌన్ తర్వాత అధికార, వ్యాపార కార్యకలాపాలను పార్క్ హయత్ హోటల్ నుంచే నిర్వహిస్తున్నానని అన్నారు. దీంతో హోటల్‌లోనే తనను కలవడానికి అనేక మంది వ్యక్తులు వస్తున్నారని, అంతేకానీ అవి రహస్య సమావేశాలు కాదని సుజనా చౌదరి స్పష్టం చేశారు. తాను బురద రాజకీయాలు చేయబోనని, ఎప్పుడూ పారదర్శకంగా ఉంటానని అన్నారు. ఈ నెల 13న ఈసీ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ తనతో సమావేశం కావడం నిజంగా యాదృచ్చికంగా జరిగిందన్నారు. రమేష్ కుమార్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని అన్నారు. పార్టీ వ్యవహారాలు మాట్లాడటానికే కామినేని ఆరోజు తన వద్దకు వచ్చారని తెలిపారు. తాము ముగ్గురం రహస్యంగా సమావేశమయ్యి, ఏదో గూడుపుఠాని చేసినట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. రహస్య కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story

Most Viewed