బాంబులు పేల్చొద్దు అంటే ఎలా: రాజాసింగ్

by  |
బాంబులు పేల్చొద్దు అంటే ఎలా: రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకే నిజామాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇక ముందున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతోందని ఆయన జోష్యం చెప్పారు. కావాలనే తెలంగాణలో హిందూ పండుగలను అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.

కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో టపాసులు కాల్చొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. దీపావళి వస్తోందని తీర్పునిచ్చిన అడ్వకేట్‌కు పండుగ ఈ రోజే తెలిసిందా అని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్లతో హఠాత్తుగా టపాసుల వ్యాపారం బంద్ చేయాలని పోలీసులు హుకూం జారీ చేస్తున్నారని చెప్పారు. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఒక వేళ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఫైర్ వర్క్స్ నిర్వహించే వారు సూసైడ్ చేసుకుంటే బాధ్యులెవరన్నారు. ఒకవేళ కొవిడ్ పరిస్థితులు ఉన్నాయని ముందుగానే సమాచారం ఇస్తే అసలు వ్యాపారాలు మొత్తానికే బంద్ చేస్తుండే కదా అని తెలిపారు. ప్రస్తుతం టపాసుల బిజినెస్ పెట్టుకున్న వారు అంత సామాగ్రిని ఇంట్లోనే నిలువచేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని రాజాసింగ్ హెచ్చరించారు.

Next Story

Most Viewed