ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

by  |
ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం బీజేపీ నేతలతో కలిసి తొలుత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ పోచారం సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సీఎం కేసీఆర్ కాలరాశారన్నారు. తాను రాజీనామా లేఖ ఇచ్చేందుకు వస్తే.. స్పీకర్‌ను కూడా అందుబాటులో లేకుండా చేశారంటూ గుర్తు చేశారు.

హుజూరాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్ చెంప చెళ్లుమనిపించిన విధంగానే.. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ అహంకారం, అణిచివేతపై ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ దిమ్మ తిరిగిపోయిందంటూ చురకలు వేశారు. ఓటమితో ఏం మాట్లాడాలో తెలియక.. ప్రె‌స్‌మీట్లలో ఏదేదో మాట్లాడుతున్నారని, అది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.

ఉద్యమకారుల్లారా ఇప్పటికైనా ఆలోచించండి.. కేసీఆర్ నిజస్వరూపం తెలిసినందున ఆయన వెంట ఉండొద్దని రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఇక మీదట రాష్ట్ర ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామన్నారు. గతంలో చేసిన ఉద్యమంలాగానే ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమంటూ ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed