టీఎంసీలో చేరడానికి బీజేపీ నేతల ప్రయత్నాలు?

97

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభిని మోగించిన తృణమూల్ కాంగ్రెస్‌లోకి మాజీ నేతలు క్యూ కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ చేరినవారంతా మళ్లీ ముకుల్ రాయ్ బాటపట్టేట్టు కనిపిస్తున్నది. తాజాగా, రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత రాజీబ్ బెనర్జీ కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్‌తో భేటీ అయినట్టు తెలిసింది. ఆయన టీఎంసీలో చేరనున్నట్టు వార్తలు గుప్పుమనడంతో తాను ఇంకా బీజేపీ నేతనే అని, కునాల్‌తో మర్యాదపూర్వక భేటీ మాత్రమే జరిగిందని వివరణ ఇచ్చారు. కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం రేపో మాపో టీఎంసీలోకి చేరడం ఖాయమని చెబుతున్నారు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..