క్షమించండి.. మళ్లీ జరగకుండా చూస్తా : కుష్బు

by  |
క్షమించండి.. మళ్లీ జరగకుండా చూస్తా : కుష్బు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి, బీజేపీ నేత కుష్బు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఢిల్లీలోని బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ను మానసిక ఎదుగుదల లేని పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలకు కుష్బు క్షమాపణ కోరారు. కుష్బు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసింది. కాగా బీజేపీలో చేరిన అనంతరం ఈ నెల 14న కుష్బు చెన్నైలో ఓ మీడియాతో మాట్లాడుతూ…

మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్‌ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం విడుదల చేసిన తన ప్రకటనలో ‘ఆ సమయంలో నేను తీవ్ర దుఖం, వేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్‌లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది’ అన్నారు. అంతేకాక ‘నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్‌, బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అని కుష్బు అన్నారు.


Next Story

Most Viewed