ధర్మం ఈటల వైపే ఉంది.. కేసీఆర్‌పై కొప్పు బాషా సంచలన వ్యాఖ్యలు

by  |
BJP leader Koppu bhasha
X

దిశ, నల్లగొండ: హుజూరాబాద్‌లో పైసలకు, ప్రజాస్వామ్యానికి మధ్య యుద్ధం జరుగనుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా విమర్శించారు. గురువారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏనాడూ బహుజనులు గుర్తుకు రాలేదని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఓట్ల కోసం మొదటిసారి బహుజన మహనీయులకు నివాళులు అర్పించారని గుర్తుచేశారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని వెల్లడించారు. ధర్మం ఈటల రాజేందర్ వైపే ఉందని, బీజేపీ గెలుపు ఖాయమని అభిప్రాయపడ్డారు.

కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటేడ్ పోస్టులన్నీ హుజురాబాద్ నియోజకవర్గ వాసులకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆరోపించారు. దళితులను మోసం చేస్తూ వారి ఓట్లు దండుకునే ఎత్తుగడలో ఎన్ని స్కీంలు తెచ్చినా, వారు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed