జాన్సన్ అండ్ జాన్సన్‌తో బయోలాజికల్ కీలక ఒప్పందం

by  |
జాన్సన్ అండ్ జాన్సన్‌తో బయోలాజికల్ కీలక ఒప్పందం
X

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన టీకాను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సొంతంగా అభివృద్ధి చేస్తున్న టీకాతోపాటు జే&జే టీకాను బయోలాజికల్ ఈ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు ఉత్పత్తులకు వేర్వేరు వసతులు, ప్లాంట్లు ఉన్నాయని బయోలాజికల్ ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల మంగళవారం రాయిటర్స్‌కు వెల్లడించారు. ఈ రెండు టీకాలు వేటికవే స్వతంత్రంగా ఉత్పత్తి చేస్తామని వివరించారు. అయితే, టీకా ఉత్పత్తికి సంబంధించిన టైమ్‌లైన్ గురించి వివరాలివ్వలేరు. యేటా జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన 600 మిలియన్ టీకాలను ఉత్పత్తి చేయాలని తాము భావిస్తున్నట్టు ఫిబ్రవరిలోనే ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. బయోలాజికల్ ఈ సంస్థ తమ టీకాను ఉత్పత్తి చేయనున్నదని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా ధ్రువీకరించింది. అయితే, కేంద్రం విడుదల చేసిన ఈ ఏడాది మనదేశంలో ఉత్పత్తి కాబోయే టీకాల వివరాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ సమాచారం లేకపోవడం గమనార్హం. ఆగస్టు నుంచి 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ల సొంత టీకా డోసులనూ ఉత్పత్తి చేయాలని బయోలాజికల్ ఈ భావిస్తున్నది.

Next Story

Most Viewed