- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. ఇదేం ఉల్టా.. పుల్టా ట్విస్ట్?
దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 7లో ఏమి జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు. బాగా ఆడే వాళ్లని ఇంటి నుంచి బయటకు పంపించేశారు , ఆడని వాళ్లని ఇంట్లోనే ఉంచారు. మళ్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ అని చెప్పి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న ఎలిమినేట్ అయిన వాళ్లని ఇంట్లోకి తీసుకొచ్చారు. టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్ ఎవరని అడిగితే ఎక్కువ మంది శివాజీ అనే చెబుతారు. మైండ్ గేమ్‌తో ఆటను తనవైపు టర్న్ చేసుకున్నాడు శివాజీ. అయితే సడెన్‌గా బిగ్‌బాస్ పెద్ద ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు. అసలు దీన్ని ట్విస్ట్ అనేకంటే పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హౌస్ నుంచి శివాజీని బయటికి పంపేశారు.
నిన్నటి ఎపిసోడ్ ముగిశాక ప్రోమో ఎపిసోడ్ లో శివాజీని సడెన్‌గా కన్ఫెషన్ రూమ్‌లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుంది.. అని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ వెంటనే శివాజీ బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్‌మెట్స్ అందరితో నేను బయటికి వెళ్తున్నా.. అంటూ చెప్పేశాడు. ఈ షాక్‌తో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దు, ఏం జరిగిందంటూ ఆపేశారు. కానీ సడెన్‌గా అందరూ చూస్తుండగానే డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే యావర్‌ని పట్టుకొని ప్లే వెల్ అంటూ చెప్పేసి శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. ఆరోగ్య కారణాల దృష్ట్యా శివాజీని బయటికి పంపించేందుకు బిగ్‌బాస్ అంగీకరించి ఉండొచ్చు. అయితే ఇదే నిజమా లేక ఉల్టా పుల్టా కాబట్టి మరేదైనా కారణం ఉందో చూడాలి.