సుప్రీంకోర్టులో అనీల్ అంబానికి భారీ ఊరట

by  |
సుప్రీంకోర్టులో అనీల్ అంబానికి భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మెట్రో, రిలయన్స్ ఇన్‌ఫ్రా కేసుకు సంబంధించి 2017లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సంస్థకు వడ్డీతో సహా మొత్తం రూ. 4,650 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ఢిల్లీ మెట్రోకు ఆదేశాలు జారీ చేసింది. 2008లో రిలయన్స్ ఇన్‌ఫ్రా అనుబంధ కంపెనీ ఢిల్లీ మెట్రోతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

దీని ప్రకారం.. రిలయన్స్ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ దేశీయ తొలి ప్రైవేట్ రైల్వే సేవలు అందించడానికి సిద్ధమైంది. అయితే, రిలయన్స్ ఇన్‌ఫ్రా సంస్థ 2012, అక్టోబర్‌లో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. నిర్వహణ, ఫీజు అంశాలకు సంబంధించి వివాదం కారణంగా ఇది రద్దు చేసుకున్నారు. ఇందులో పరిహారం కోసమని ఢిల్లీ మెట్రోపై రిలయన్స్ ఇన్‌ఫ్రా సంస్థ ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. 2017లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ రిలయన్స్ ఇన్‌ఫ్రా విభాగానికి నష్టపరిహారాన్ని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న అనీల్ అంబానీకి తాజాగా సుప్రీంకోర్టు తీర్పు భారీ ఊరటనిచ్చింది.



Next Story

Most Viewed