- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెక్కన్ చార్జర్స్ కేసులో బీసీసీఐకి భారీ ఊరట
దిశ, స్పోర్ట్స్: డెక్కన్ చార్జర్స్ యాజమాన్యంతో ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కేసులో బీసీసీఐకి భారీ ఊరట లభించింది. ఐపీఎల్‌లో ఒకప్పటి డీసీ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు రూ. 4,800 కోట్లు చెల్లించాంటూ ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టేసింది. 2008 నుంచి 2012 వరకు 5 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ఫ్రాంచైజీగా ఉన్న డెక్కన్ చార్జర్స్ 2012లో రూ. 100 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో బీసీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసి డెక్కన్ చార్జర్స్ టీమ్‌ను రద్దు చేసింది. కాగా, తమకు ఇచ్చిన 30 రోజుల గడువు పూర్తి కాకముందే బీసీసీఐ జట్టును రద్దు చేసిందని ఆరోపిస్తూ డీసీహెచ్ఎల్ కోర్టును ఆశ్రయించింది. బాంబే కోర్టు ఆదేశాలతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్బిటర్‌గా వాదోపవాదాలు జరిగాయి. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద రూ. 8 వేల కోట్లు బీసీసీఐ తమకు చెల్లించాలని డీసీహెచ్ఎల్ కోరింది. వాదోపవాదాలు విన్న అర్బిటర్ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. కాగా, ఈ తీర్పుపై బీసీసీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. జస్టీస్ జీఎస్ పటేల్‌తో కూడిన బెంచ్ ఆర్బిటర్ ఆదేశాలను కొట్టేస్తూ తాజాగా తీర్పు చెప్పారు. దీంతో బీసీసీఐకి భారీ ఊరట లభించింది.