66 మిలియన్ ఏళ్ల నాటి డైనో.. వేలంలో 1.5 మిలియన్ పౌండ్స్ పలికే చాన్స్!

by  |
Big John
X

దిశ, ఫీచర్స్ : సుమారు 66 మిలియన్ ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడిన అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన డైనోసర్ ‘టైసర్ టాప్స్’. దాని మూడు కొమ్ములతో దాడి చేసే ఈ భారీ డైనోలు పూర్తిగా శాకాహారులు కాగా, ఓ డైనోను పాలియోంటాలజిస్టులు 2014లో మొదటి ఎముక భాగాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత దాని అస్థిపంజరంలో 60%, దాదాపు పూర్తి పుర్రెతో సహా గుర్తించారు. అయితే ఆ స్కెలిటన్‌ను అక్టోబర్‌లో వేలం వేయనుండగా, అంతకుముందు ప్రజల కోసం పారిస్‌లో ప్రదర్శించారు.

argest Dianosaur

టైసర్ టాప్స్‌గా పిలిచే ఈ డైనోకు ‘బిగ్ జాన్’గా పేరుపెట్టారు. ఇది 2.62 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో 700 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంది. ఈ డైనోలు అలస్కా నుంచి మెక్సికో వరకు విస్తరించి ఉన్న ద్వీప ఖండమైన లారామిడియాలో నివసించినట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ డకోటాలో హెల్ క్రీక్ అనే ఓ పురాతన వరద మైదానంలో ‘బిగ్ జాన్’ మరణించినట్లు గుర్తించారు. అస్థిపంజరాల పునరుద్ధరణలో నిపుణులైన జోయిక్ వర్క్‌షాప్‌ బిగ్ జాన్‌పై పరీక్షలు చేయగా, దాని మెడపై ఉన్న గాయం కారణంగా మరొక డైనోసర్‌తో లేదా ఇతర జంతువులతో పోరాటం చేసి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇప్పటి వరకు కనుగొన్న ఇతర ట్రైసెరాటాప్‌ల కంటే ఈ అస్థిపంజరం 5-10% పెద్దదని బిగ్ జాన్ పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించిన పాలియోంటాలజిస్ట్ ఇయాకోపో బ్రయానో అన్నారు.

డైనోసర్ అస్థిపంజరాలకు క్రేజ్ ఎక్కువగా ఉందని, యాన్యువల్ నాచురాలియా విక్రయంలో భాగంగా బిగ్ జాన్‌ను అక్టోబర్ 21న పారిస్ డ్రూట్ యాక్షన్ హౌస్‌లో వేలం వేయనున్నారు. దీనికి 1.5 మిలియన్‌ పౌండ్స్ వరకు లభిస్తుందని భావిస్తున్నారు.


Next Story

Most Viewed