పవన్ ఫ్యాన్స్‌కు హాట్ న్యూస్.. భీమ్లా నాయక్‌పై సూపర్ అప్ డేట్

by  |
పవన్ ఫ్యాన్స్‌కు హాట్ న్యూస్.. భీమ్లా నాయక్‌పై సూపర్ అప్ డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఇందులో రానా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి దిమ్మతిరిగిపోయే వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. భీమ్లా నాయక్‌కు ఇక 8 రోజులే అంటూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

అసలు విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ శరవేగంగా దూసుకుపోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ షూటింగ్ మరో 8 రోజుల్లో పూర్తవుతుందట. అనంతరం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ ఇదే హాట్ టాపిక్. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మేకర్స్ ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed