అవినీతి ఆరోపణలపై భారత్ బయోటెక్ క్లారిటీ

by  |
Brazil suspends Covaxin deal as graft allegations probed
X

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థపై బ్రెజిల్‌లో వచ్చిన ఆరోపణలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. బ్రెజిల్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని, అలాగే, కొవాగ్జిన్ టీకాలనూ ఆ దేశానికి సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. టీకా అనుమతి ప్రక్రియను సక్రమంగా అనుసరించామని వివరించింది. వివిధ దేశాల్లో ప్రభుత్వాల నుంచి అనుమతి పొందడానికి టీకా కంపెనీలు అనుసరించే ప్రక్రియనంతా పారదర్శకంగా ఫాలో అయ్యామని పేర్కొంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పక్షపాతంతో వ్యవహరించి ఎక్కువ ధరకు కొవాగ్జిన్ టీకా కొనుగోలుకు సహకరించారని, 324 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

పార్లమెంటరీ ప్యానెల్ ముందూ ఇద్దరు వ్యక్తులూ ఇలా వాంగ్మూలాన్నిచ్చారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే భారత్ బయోటెక్‌తో కుదిరిన ఒప్పందాన్ని బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపేసింది. వీటిపై భారత్ బయోటెక్ స్పందిస్తూ బ్రెజిల్‌లో కొవాగ్జి్న్ టీకాకు జూన్ 4న అత్యవసర వినియోగ అనుమతి లభించిందని, క్రమపద్ధతిలో రెగ్యులేటరీ అప్రూవల్స్, కాంట్రాక్టు కోసం ఎనిమిది నెలల ప్రాసెస్‌ చేపట్టిందని వివరించింది. భారత్ మినహా ఇతర దేశాల్లో కొవాగ్జిన్ డోసుకు 15 నుంచి 20 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తున్నామని, బ్రెజిల్‌కూ 15 అమెరికన్ డాలర్లకే సరఫరా చేయడానికి డీల్ కుదిరిందని తెలిపింది. ఇదే రీతిలో ఇతర దేశాల్లోనూ అనుమతులు పొందిందని, కొన్ని దేశాల నుంచి అడ్వాన్స్‌లు అందగా, ఇంకొన్ని దేశాలకు టీకా సరఫరా ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. భారత్ బయోటెక్‌తో కాంట్రాక్టులో అవినీతి లేదని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కొట్టిపారేశారు.



Next Story

Most Viewed