మీరు ప్రకృతి ప్రేమికులా? ఇవి చూసేయండి మరి!

by  |
మీరు ప్రకృతి ప్రేమికులా? ఇవి చూసేయండి మరి!
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ప్రజలు వరుస పెట్టి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ వంటి స్ట్రీమింగ్ సర్వీసుల్లో సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఎంత చూసినా తమ అభిరుచికి తగిన కార్యక్రమాలు అప్పటికే చూసి ఉండటంతో కొద్దిసేపటికే బోర్ ఫీలవుతున్నారు. ప్రకృతి ప్రేమికులైతే మరీ… స్ట్రీమింగ్ సర్వీసుల్లో తమకు నచ్చినవి దొరక్క… మంచి మంచి ఎక్కడ దొరుకుతాయో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం యూట్యూబ్‌లో ఉచితంగా చూడగల కొన్ని మంచి షార్ట్ వీడియోలు, డాక్యుమెంటరీల వివరాలు మీకోసం…

ఈ జాబితాలో River terns of Bhadra మొదటిస్థానంలో నిలుస్తుంది. భద్ర టైగర్ రిజర్వ్‌లోని అందచందాలను ఇందులో చూడొచ్చు. భద్రానది నీళ్లతో పచ్చగా కనిపించే ఈ రిజర్వ్ గురించి చాలా మందికి తెలియదు. కానీ రివర్ టెర్న్స్ మాత్రం ఇక్కడ గూడు కట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. వాటి నివాసం, ఇల్లు కట్టుకునే తీరు, వాటి అలవాట్లను దాచి ఉన్న కెమెరాల ద్వారా ఐదు నెలల పాటు షూట్ చేసి, ఈ వీడియో రూపొందించారు.

The Western Ghats of India డాక్యుమెంటరీలో జీవవైవిధ్యానికి మారుపేరుగా చెప్పే సహ్యాద్రి కొండల అందాలు చూడొచ్చు. ఇక్కడి పర్వతాలు, కొండలు, లోయలు, జలపాతాలను ఈ డాక్యుమెంటరీ చక్కగా కాప్చర్ చేసింది. ఇక Namaami Aranyaka షార్ట్ వీడియోలో హోన్నావర్ ప్రకృతి మాయను ఒక ఆటవికుడి దృష్టితో చూడొచ్చు. అంతేకాకుండా Aganashini డాక్యుమెంటరీ కూడా పడమటి కనుమల జీవవైవిధ్యాన్ని సరికొత్త కోణంలో చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీకి సినిమాటోగ్రఫీలో ఉత్తమ షోగా అవార్డు కూడా లభించింది. వీటితో పాటు A day at Mysore zoo, Daroji Bear sanctuary, Our Planet, Dancing with the birds, Night on the earth, Beak and brain వంటి డాక్యుమెంటరీలు ఈ లాక్‌డౌన్ సమయాన్ని ప్రకృతి సమక్షంలో గడుపుతున్న అనుభూతిని కలిగిస్తాయి.

Tags: Documentaries, Wildlife, River tern, western ghats, birds, Bhadra river, lockdown



Next Story

Most Viewed