ఇకపై బెంగళూరు ఎఫ్‌సీలో అజిత్ కుమార్..

by  |
ఇకపై బెంగళూరు ఎఫ్‌సీలో అజిత్ కుమార్..
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్ (ISL) కొత్త సీజన్ ఈ ఏడాది నవంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఆయా ఫుట్‌బాల్ క్లబ్స్ కొత్త ప్లేయర్ల (New players)ను తమ జట్టులో చేర్చుకోవడానికి పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. రెండుసార్లు ఐఎస్ఎల్ గెలిచిన చెన్నైయన్ ఎఫ్‌సీ ఇప్పటికే అనిరుధ్ థాపా సహా 9 మంది భారత జట్టు ప్లేయర్ల (Indian team players)ను తమ ఫ్రాంచైజీలో కొనసాగుతున్నట్లు ప్రకటించింది.

అయితే చెన్నైయన్ ఎఫ్‌సీ (Chennaiyan fc)ని దెబ్బతీస్తూ ఆ జట్టులోని కీలక సభ్యుడైన అజిత్ కుమార్‌ (Ajith kumar)ను బెంగళూరు ఎఫ్‌సీ (Bengalore fc) తమ ఫ్రాంచైజీలో చేర్చుకుంది. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడటానికి భారీ మొత్తానికే అజిత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది.

అయితే ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందనే విషయం ఇటు అజిత్ కానీ, అటు బెంగళూరు ఎఫ్‌సీ వర్గాలు కానీ వెల్లడించలేదు. కాగా, బెంగళూరు జట్టుతో చేరడంపై అజిత్ స్పందిస్తూ.. ‘ఈ ఫ్రాంచైజీతో జట్టు కట్టడం నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నది. చాన్నాళ్లుగా బెంగళూరు జట్టుతో ఆడాలని నాకు కోరికగా ఉంది. అది ఈ రోజు నెరవేరింది. ఈ జట్టు రాబోయే ఐఎస్ఎల్‌ (ISL)లో రాణించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని అజిత్ మీడియాకు వెల్లడించాడు.



Next Story

Most Viewed