బీఈడీ విద్యకు అర్హులుగా బీబీఏ విద్యార్థులు

by  |
Bed Students
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. బీబీఏ పట్టభద్రులై విద్యార్థులు కూడా రెండేళ్ల బీఈడీ కోర్స్ చేసేందుకు అవకాశాలన్ని కల్పిస్తున్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోం సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ తో పాటు బీబీ ఏ పట్టభద్రులు కూడా ప్రవేశపరీక్ష రాయవచ్చని తెలిపారు, బీఈడీలో ప్రవేశం కొరకు అభ్యర్థులు 50శాతం మార్కులతో ఉత్తీర్ణలు కావల్సి ఉంటుందని నిబంధనలు విధించారు.

ఇతర కోర్సుల అభ్యర్థుల మాదిరిగానే ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా ఉత్తీర్ణతా మార్కుల శాతాన్ని 50శాతానికి తగ్గించారు. ఇక నుంచి బీఈడీ కోర్సును అన్ని మొథడాలజీలకు, సబ్జెక్టులకు చెందిన విద్యార్థులంతా అర్హులుగా స్పష్టం చేశారు. మ్యాథ్స్ విద్యార్థులకు 25శాతం సీట్లు, పిజికల్ సైన్సెస్, బయోలజీ విద్యార్థులకు 30శాతం సీట్లు కేటాయించామని తెలపారు. ఫిజికల్ సైన్సెస్, బయోలజీలో కనీసం 10శాతం చొప్పున గరిష్టంగా 20శాతానికి మించకుండా సీట్లు ఉంటాయన్నారు. సోషల్ సైన్సెస్, ఇంగ్లిష్, ఓరియంటల్ లాంగ్వేజస్ కు 45శాతం సీట్లు ఉంటాయని చెప్పారు. ఇంగ్లిష్, ఓరియంటల్ లాంగ్వేజీలో కనీసం 5 శాతం చొప్పున రెండింటీకి కలిపి గరిష్టంగా 15 శాతం వరకు సీట్లు ఉండనున్నాయని వివరించారు.

ఇంటర్ లో గణితం సబ్జెక్ట్ చదివి డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, బీసీఏ పూర్తి చేసిన విద్యార్థులు బీఈడీకి అర్హులని తెలిపారు. ఇంటర్ లో బోటనీ, జువాలజీ సబ్జెక్ట్ లతో బీఎస్సీ, బీసీఏ చదివిన విద్యార్థులు బీఈడీకి అర్హులుగా ప్రకటించారు. ఇంటర్ లో సోషల్ సైన్సెస్ చదివి బీకాం, బీబీఎం, బీబీఏ, బీసీఏ చేసిన విద్యార్థులకు కూడా బీఈడీ చదివేందుకు అర్హులుగా తెలిపారు. స్పెషల్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ లిటరేచర్ లో బీఏ చదివిన వారు లేదా ఎంఏ ఇంగ్లిష్ చదివిన వారికి బీఈడీలో అర్హత ఉంటుందన్నారు.

తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం భాషల్లో బీఏ, బీఏ లిటరేచర్, బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ చదివిన వారికి, ఎంఏ పూర్తి చేసి వారికి ఓరియంటల్ లాంగ్వేజెస్ గా బీఈడీలో అవకాశం ఉంటుందన్నారు. అన్ని మెథడాలజీలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అర్హతా సబ్జెక్ట్ ల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు. ఈ మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనల్లో సవరణలు చేపడుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed