ఈసారి బతుకమ్మ చీరలు నేరుగా ఇంటికే !

by  |
ఈసారి బతుకమ్మ చీరలు నేరుగా ఇంటికే !
X

దిశ, వెబ్ డెస్క్: ఈసారి కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంట. అయితే, ఈసారి మాత్రం ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోంది. ప్రతిసారి ఇచ్చే విధంగా కాకుండా నేరుగా ఇంటికే పంపించేలా సన్నాహాలు చేస్తోందంట. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోటి చీరలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ అంశంపై కేసీఆర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, గతంలో కూడా దసరా పండుగకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే, ఆ సమయంలో ప్రతిపక్షాలు, కొంతమంది ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పలుచోట్ల బతుకమ్మ చీరలను రోడ్లపై కాలబెట్టన విషయమూ విధితమే.

Next Story

Most Viewed