పోయిరావమ్మా .. గౌరమ్మ

113

దిశ, తాండూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఊరూరా, వాడవాడలా కూడళ్లలోకి తీసుకువచ్చి ఆటలు ఆడి పాడారు.

చిత్తు, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా అంటూ మహిళలు, యువతులు పాటలు పాడుతూ లయబద్ధంగా బతుకమ్మల చుట్టూ తిరిగారు. మహిళలు, యువతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి డీజే సాంగ్స్ మధ్య స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చివరగా గ్రామాల సమీపంలోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి పోయిరావమ్మ.. గౌరమ్మ అంటూ మహిళలు, యువతులు ఘనంగా వీడ్కోలు పలికారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..