అధికారుల అత్యుత్సాహం.. నడి వీధిలో రైతుల భారీ కటౌట్స్

by  |
అధికారుల అత్యుత్సాహం.. నడి వీధిలో రైతుల భారీ కటౌట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అన్నంపెట్టే రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంట సరిగా పండక, సరైన గిట్టుబాటు ధర లేక ఎన్నో విధాలుగా రైతు అప్పుల ఊబిలో చిక్కుకపోతాడు. ఇలాంటి సమయాల్లో ఎంతో కొంత ఆసరాగా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని కొంత వరకు నెట్టుకొస్తారు. అయితే అప్పులిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు రైతన్నను నడివీధిలోకి ఈడుస్తే ఎంత దురదృష్టకరం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా కోఆపరేటివ్‌ అధికారులు అత్యుత్సాహం ప్రద‌ర్శిస్తూ రైతుల ప‌రువు తీసే ప్రయ‌త్నం చేశారు. దేశానికి వెన్నుముక రైతు అంటూనే అలాంటి రైతన్నలపై కనీసం కనికరం చూపకుండా వారి పేర్లు, ఫొటోలతో నడివీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఏం జరిగిందంటే..

కొంద‌రు రైతులు వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం గ‌తంలో రుణాలు తీసుకున్నారు. అయితే, గ‌త ఏడాది కరోనా విజృంభ‌ణ, భారీ వ‌ర్షాల‌ కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని, అప్పులు తీర్చడానికి సమయం ఇవ్వాల‌ని రైతులు బ్యాంకు అధికారులను కోరారు. అయినా బ్యాంకు అధికారులు ఏమాత్రం కనికరం చూపకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. అంతే కాకుండా డబ్బులు చెల్లించకపోతే భూములు వేలం వేస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed