అప్పటివరకు ఈ ప్రభావం తప్పదు : బోఫా!

by  |
అప్పటివరకు ఈ ప్రభావం తప్పదు : బోఫా!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వృద్ధి రేటు కరోనా వ్యాక్సి రావడంపై ఆధారపడి ఉందని, వైరస్ వల్ల ప్రపంచ వృద్ధి రేటుతో సహా అన్ని దేశాల వృద్ధి రేటు క్షీణించనున్నట్టు ఇప్పటికే పలు ఏజెన్సీలు అంచనాలను ప్రకటించాయి. ఒకవేళ కరోనాకు వ్యాక్సి తయారీ ఆలస్యమైతే 2020-21 ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ -7.2 శాతం నమోదు చేస్తుందని, వ్యాక్సిన్ వస్తే -4 శాతం ఉండొచ్చునని తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా(బోఫా) సెక్యూరిటీస్ ఆర్థిక వేత్తలు అంచనాలను వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు, శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంత సమయం పడుతుందనేది తెలియడంలేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా లాక్‌డౌన్ వల్ల ఒక శాతం చొప్పున వృద్ధి ప్రభావానికి లోనవుతుందని బోఫా ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అలాగే, ఆర్థిక వృద్ధిని గాడిన పెట్టేందుకు ఆర్‌బీఐ మరో రెండు శాతం వరకు రెపో రేటును కట్ చేసే అవకాశాలున్నాయని, అన్‌లాక్ దశలో కేసులు మూడు రెట్లు పెరిగినందున జీడీపీపై ప్రభావం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగవచ్చని బోఫా ఆర్థికవేత్తలు తెలిపారు.

Next Story

Most Viewed