‘కేటీఆర్‌ను సీఎం చేయాలని టీవీలు పగలగొడుతున్న హిమాన్షు’

608
ktr son

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో అంతా నయీమ్ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం కాంగ్రెస్ నేత మాల్యాద్రి రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కూడబెట్టడం, నేరాల వంటివి నయీమ్ డైరీని చూసి కేసీఆర్, పోచారం కుటుంబాలు చేస్తున్నాయన్నారు. బాన్సువాడలో మాఫియా రాజ్యం నడుస్తోందని, కేసీఆర్ తెలంగాణను దోచుకుంటే.. పోచారం కొడుకులు బాన్సు వాడను దోచుకుంటున్నారని విమర్శించారు.

కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ మనుమడు రోజుకో టీవీ పగులగొడుతున్నాడని.. అందుకే ప్రగతి భవన్ ఎదుట టీవీ షోరూం ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. బీజేపీ హిందువుల కోసం పనిచేస్తోందని, హిందువు అని చెప్పుకుంటే మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారు అని మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. బాన్సువాడ వెనుకబడ్డ ప్రాంతం కాదని అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతం అని అన్నారు. ఇక్కడ ఉన్న పోచారం కుటుంబ పాలనకు బీజేపీ పార్టీ చరమ గీతం పాడుతుందన్నారు. 2023లో బాన్సువాడలో టీఆర్ ఎస్ బాక్సులు బద్దలవుతాయన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..