పార్టీ మారిన వాళ్లపై రేవంత్ సీరియస్.. నీ సంగతేంటీ అంటూ బాల్క సుమన్ ఫైర్

by  |
Balka-Suman-And-Revanth-Re
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలు సైతం మళ్లీ కాంగ్రెస్ గూటికి రావాలని చూస్తున్నారన్న సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే, ఓ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన నేతలను రాళ్లతో కొట్టండి అంటూ కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీరియస్ అయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమంటున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌ను ఏం చేయాలి.? అని ఫైర్ అయ్యారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉంది రేవంత్ ప్రవర్తన అంటూ బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Next Story

Most Viewed