డెయిలీ వర్కర్ టు లెఫ్టినెంట్ కల్నల్!

by  |
డెయిలీ వర్కర్ టు లెఫ్టినెంట్ కల్నల్!
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్, సుందర్‌పూర్ బర్జా గ్రామంలో పుట్టిన బల్బంక తివారి చిన్నతనంలో చాలా కష్టాలు ఎరుర్కొన్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తే, అతడికి 50 రూపాయలు వచ్చేవి. అలా పనిచేస్తూనే చదువును కొనసాగించాడు. కట్ చేస్తే.. 28 ఏళ్ల తివారి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో భారత ఆర్మీకి సేవలందించే అధికారిగా ఎదిగాడు. ఎలా?

ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తివారి.. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో పదో తరగతి తర్వాత చదువు ఆపేసి, పని వెతుక్కుంటూ ఒడిషాలోని రూర్కెలాకు వెళ్లాడు. మొదట ఐరన్ స్ప్రింగ్స్, రాడ్స్ కట్ చేసే ఓ ఫ్యాక్టరీలో పనిచేసిన తను.. ఆ తర్వాత ‘నమ్‌కీన్’ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే మళ్లీ చదవడం ప్రారంభించిన తివారి ట్యూషన్స్‌కు వెళ్లేవాడు. కాగా ఎలాగైనా ఆర్మీలోకి వెళ్లాలని తను చిన్నప్పుడే నిశ్చయించుకున్నాడు. అదే లక్ష్యంతో తన ప్రయత్నాలు కొనసాగించిన తివారి.. 2012లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఈఎమ్ఈ) ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసి భోపాల్‌లోని ఆర్మీ సెంటర్‌లో జవాన్‌గా జాయిన్ అయ్యాడు. సిపాయిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, సోల్జర్ నుంచి ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్‌గా పదోన్నతి పొందడానికి నిర్వహించే ఆర్మీ క్యాడెట్ కాలేజ్(ఏసీసీ) ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. 2017లో ఆ పరీక్ష పాస్ కావడంతో ఇండియన్ మిలిటరీ అకాడమీలో జాయిన్ అయ్యాడు. తాజాగా ‘ఆర్మీ ఆఫీసర్’గానూ పదోన్నతి పొందాడు.

‘నేను ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో ట్రైనింగ్ షెడ్యూల్, పాండమిక్ కారణాలతో ఆయన ఇంటికి రాలేకపోయాడు. మా ప్రేమకు కానుకగా పుట్టిన మా బిడ్డను కూడా ఇంతవరకు చూడలేదు. తను ఆర్మీ ఆఫీసర్‌గా నియమితులైన రోజు పాపను చూడటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి, చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన దేశం గర్వపడే విధంగా తివారి సేవలు అందిస్తాడు’ అని తివారి భార్య రుచి తెలిపింది.



Next Story

Most Viewed