ఎన్‌టీఆర్ ఆశయ సాధనకు కృషి: ఎమ్మెల్యే బాలకృష్ణ

by  |
ఎన్‌టీఆర్ ఆశయ సాధనకు కృషి: ఎమ్మెల్యే బాలకృష్ణ
X

దిశ, బేగంపేట: ఎన్‌టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని టీడీపీ కార్యకర్తలను సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. ఎన్‌టీఆర్ 25‌వ వర్ధంతిని పురస్కరించుకుని బేగంపేట డివిజన్‌లో‌ని రసుల్‌పురాలో ఎన్‌టీ‌ఆర్ విగ్రహానికి పూలమాలవేసి, కాగడ‌తో అమరజ్యోతి వెలిగించి నివాళులర్పించారు. తెలుగు రాష్టాల గుర్తింపునకు దేశం‌లో ప్రధాన భూమిక పోషించిన ఘనత ఎన్‌టీ‌ఆర్‌దని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ సనత్‌నగర్ నియోజక‌వర్గ ఇన్‌చార్జ్ శ్రీపతి సతీష్ పాల్గొన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story