చిరంజీవి, నాగ్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..

by  |
balayya 1
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు తెలుగు ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం ‘మా’ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. మీడియాతో బాలయ్య మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ నేను పట్టించుకోనని అన్నారు. ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారన్నదే నా ప్రశ్న అని అడిగారు.

మనది గ్లామర్ ఇండస్ట్రీ.. సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.. ‘మా’ బిల్డింగ్ కోసం అడిగితే ఒక్క ఎకరం భూమి ఇవ్వరా అని ప్రశ్నించారు. ‘మా’ బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకు వస్తే నేను సహకరిస్తానని అన్నారు. అందరం కలిసి ప్రయత్నిస్తే.. ఇంద్రభవనం నిర్మించవచ్చునని పేర్కొన్నారు. ఫండ్ రైజింగ్ కోసం ఫ్లస్ట్‌క్లాస్‌లో అమెరికా తిరిగారు.. ఆ డబ్బంతా ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. బాలయ్య వ్యాఖ్యలు తాజా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అయితే, చిరంజీవి, నాగార్జున టార్గెట్ చేస్తూ బాలయ్య కామెంట్స్ చేసారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story