తిన్నింటికే కన్నం వేసిన ఘనులు.. నలుగురి అరెస్టు

by  |
తిన్నింటికే కన్నం వేసిన ఘనులు.. నలుగురి అరెస్టు
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలోని భద్రాద్రి కో-ఆపరేటర్ బ్యాంకులో 24-08-2021 తేదీన 1,86,36,200 రూపాయలను సిబ్బంది దుర్వినియోగం చేశారని జిల్లా ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఏఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. భద్రాద్రి కో-ఆపరేటర్ పట్టణ బ్యాంకులో ఆగస్టు -8వ తేదీన డబ్బులను దుర్వినియోగం చేశారని బ్యాంకు కార్యనిర్వహణ అధికారి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

ఆయన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు విచారణ చేపట్టగా బ్యాంక్ మేనేజర్ పందుల రాము, బ్యాంక్ అస్సిస్టెంట్ ఎస్.కే అక్బర్, బ్యాంక్ కోశాధికారి చిత్తపోగు రామారావు, బ్యాంక్ అటెండర్ గనిబోయిన రవీందర్ కుమార్‌లు 24-08-2021 తేదీన బ్యాంక్‌లో 2,91,29,900/- మొత్తంలో 1,86,36,200 నగదును పక్కదారి పట్టించి, తమ జల్సాల కోసం దుర్వినియోగం చేశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన వీరిపై 243/2021 U/sec 409,420,120 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ నగదు వ్యవహారం గత రెండేళ్లుగా జరుగుతోందని ఎస్పీ వివరించారు. అనంతరం నిందితుల నుంచి 1,44,02,00 రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు విచారణలో చురుగ్గా పనిచేసిన మణుగూరు ఏఎస్పీ శబరీష్‌, సీఐ భానుప్రకాశ్‌, ఎస్ఐ నరేష్‌, కానిస్టేబుల్స్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఆ తర్వాత బ్యాంకు అధికారి మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, ఎవరి డబ్బులు వారి అకౌంట్లో భద్రంగా ఉన్నాయన్నారు. యధావిధిగా నిత్యం బ్యాంక్ లావాదేవీలు కొనసాగుతాయని వివరించారు.

Next Story

Most Viewed