కాబూల్ ఎయిర్‌పోర్టులో విషాదం.. తండ్రి చేతిలో చిన్నారి మృతి

by  |
baby
X

దిశ, వెబ్‌డెస్క్ : కాబూల్ ఎయిర్ పోర్టులో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాలిబన్ల నుంచి తమ కుటుంబాన్ని రక్షించుకునేందుకు కాబూల్ ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్న ఓ తండ్రి చేతిలోనే చిన్నారి మృతి చెందింది. రెండ్రోజులుగా దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయం బయట తిండి తిప్పులు లేకుండా ఆ కుటుంబం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి చిన్నారి మృతి చెందినట్టు తెలుస్తోంది. తన చేతిలోనే చిన్నారి మృతి చెందటంతో ఆ తండ్రి రోదనలు అందరినీ కలిచివేశాయి. ఈ ఘటన ఆఫ్ఘన్‌లో నెలకొన్న ప్రస్తుత దారుణ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.

ఇదిలాఉండగా ఎయిర్ పోర్టు బయట చిన్నారుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తల్లిదండ్రులు తాము ఏమైపోయినా పర్లేదు కానీ, తమ పిల్లలను రక్షించాలని అమెరికా, బ్రిటీష్ సైన్యాన్ని వేడుకుంటున్నారు. ఆర్మీ కూడా చిన్నారులను యుద్ధ విమానాల్లో తమ దేశాలకు తరలిస్తున్నాయి. ఏడుస్తున్న పిల్లలను సైనికులు అక్కున చేర్చుకుంటున్నారు. ఆహారం కోసం ఎదురుచూస్తున్న పిల్లలకు ఫుడ్ అందించడమే కాకుండా వైద్యం కూడా చేయిస్తున్నారు. తాలిబన్ల నుంచి దేశం విడిచి పారిపోయేందుకు కాబూల్ ఎయిర్ పోర్టు బయట లక్షల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు ఎదురుచూస్తుండగా.. అక్కడ దర్శనమిస్తున్న హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

Next Story