ఆ ఐదుగురి నిర్ణయమే.. కౌన్సిల్ నిర్ణయమా? : అజారుద్దీన్

by  |
Azharuddin
X

దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) గౌరవానికి భంగం కలిగించేలా తాను ఎప్పుడూ పనిచేయలేదని తొలగించబడిన అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో మొత్తం 9 మంది ఉంటారని.. కానీ వారిలో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి తీసుకున్న నిర్ణయాన్నే అపెక్స్ కౌన్సిల్‌గా ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్ అన్నారు. హెచ్‌సీలో జరుగుతున్న అవినీతిని అరికట్డడానికి సమర్థుడైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే వ్యతిరేకించింది ఆ ఐదుగురే అని అజార్ ఆరోపించారు. తనకు అపెక్స్ కౌన్సిల్ పేరుతో నోటీసులు జారీ చేసిన జాన్ మనోజ్, విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధలపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. వాటని అడ్డుకున్నందుకే తనకు నోటీసులు ఇచ్చారని అజారుద్దీన్ అంటున్నారు. హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం జనరల్ బాడీకే ఉంటుంది.

Azharuddin,-HCA

మెజార్టీ లేకుండా ఐదుగురు కలసి తనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు చెబితే ఎలా అని అజార్ ప్రశ్నించారు. హెచ్‌సీఏలో వారి గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించునందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అజార్ ఆరోపిస్తున్నారు. ఒక మాజీ క్రికెటర్‌గా స్టేడియంకు వచ్చి ఆటగాళ్లకు సలహాలు ఇస్తాను. దాన్ని కూడా వారు తప్పుగా భావిస్తే తానేమీ చేయాలన్నారు. గత పాతికేళ్లుగా జరుగుతున్న నిధుల అవకతవకలపై తాను ఆరా తీస్తున్నందునే ఇలా బద్నాం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికీ ఉప్పల్, జింఖానా గ్రౌండ్లను తప్ప మరో మైదానాన్ని హైచ్‌సీఏ అభివృద్ది చేయలేకపోయింది. కానీ వీటి రెండింటి కోసం నెలకు రూ. 18 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికీ ఫైవ్ స్టార్ సౌకర్యాలు లేవని అజర్ దుయ్యబట్టారు. కాగా, లోధా సిఫార్సుల మేరకే తాము అజారుద్దీన్‌పై చర్యలు తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ చెప్పింది.


Next Story

Most Viewed