అయోధ్యలో వీవీఐపీలకు ‘మహాప్రసాద్’ కిట్లు.. వాటిలో ఏమున్నాయ్ ?

by Dishanational4 |
అయోధ్యలో వీవీఐపీలకు ‘మహాప్రసాద్’ కిట్లు.. వాటిలో ఏమున్నాయ్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : సోమవారం రోజు అయోధ్య రామమందిరంలో జరిగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీలు, ప్రముఖులకు ప్రత్యేకమైన మహా ప్రసాద్ ప్యాకెట్లను అందజేయనున్నారు. ఇందుకోసం ఆలయ ట్రస్టుకు 20వేలకుపైగా ‘మహాప్రసాద్’ కిట్లు అందాయి. మహా ప్రసాదం కిట్‌లో స్వచ్ఛమైన నెయ్యి, ఐదు రకాల డ్రై ఫ్రూట్స్, పంచదార, శెనగపిండి (బేసన్), పవిత్ర సరయూ నదీ జలంతో చిన్న బాటిల్, ఎరుపు దారం, సుపారీ (తమలపాకులు), అక్షింతలు, రామ కందమూలం, కుంకుమ, రుద్రాక్ష ఉన్నాయి. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ మార్గదర్శకత్వంలో గుజరాత్‌లోని భగ్వా సేన భారతి గర్వి సంత్ సేవా సంస్థాన్ ఈ మహా ప్రసాదం కిట్లను సిద్ధం చేసి అందించింది. దాదాపు 200 మందితో కూడిన టీమ్ 5వేల కిలోల పదార్థాలతో మహా ప్రసాదం కిట్లను ప్రిపేర్ చేశారు. అయోధ్యా నగరిలో సాధువుల బస, భోజన ఏర్పాట్ల పనులతో పాటు మహాప్రసాదం సిద్ధం చేసే బాధ్యతను తమకు అప్పగించారని భగ్వా సేన జాతీయ అధ్యక్షుడు కమల్ భాయ్ రావల్ తెలిపారు. సోమవారం రోజు ముఖ్య అతిథులకు అందించే వంటకాల్లో బాదం బర్ఫీ, మటర్ కచోరీ, మిల్లెట్ డిషెస్ కూడా ఉన్నాయి. ఈ వంటకాలను వారణాసి, ఢిల్లీకి చెందిన చెఫ్‌లు వండుతారు.

Read More..

అయోధ్యలో అంతా ‘రామమయం’: 2000 క్వింటాళ్ల పూలతో అలంకరణ



Next Story

Most Viewed