రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు: యోగా గురువు రాందేవ్

by Dishanational2 |
రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు: యోగా గురువు రాందేవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తంపై పలు పీఠాధిపతులు చేసిన వ్యాఖ్యలపై యోగా గరువు రాందేవ్ స్పందించారు. ముహూర్తం పవిత్రమైంది కాదని చెప్పడం సరికాదన్నారు. రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దని కోరారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పవిత్రత ఉంటుందని తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు. రామరాజ్యం దిశగా దేశం యొక్క పురోగతి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పటి నుంచి దేశంలో సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కూడా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతుందని తెలిపారు దేశాన్ని ఆర్థిక, విద్యా బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు ప్రాణ ప్రతిష్ట రోజున దేశప్రజలు ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.



Next Story

Most Viewed