త్వరలో జట్టుతో కలవనున్న అక్షర్ పటేల్

by Shiva |
త్వరలో జట్టుతో కలవనున్న అక్షర్ పటేల్
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ త్వరలో జట్టుతో కలవనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. గత నెల 28న జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్న తర్వాత అక్షర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. మొదటి పరీక్షలో నెగెటివ్ వచ్చినా.. రెండో పరీక్షలో మాత్రం పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడు ముంబైలోకి ఒక హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాగా, ప్రస్తుతం అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకున్నాడని.. త్వరలోనే జట్టుతో కలుస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నెల 15ప రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు మాత్రం అక్షర్ పటేల్ అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది. ఐసోలేషన్‌లో ఉండి ఇప్పటికి 10 రోజులు అవుతున్నది. దీంతో అతడికి మరో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ రెండు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన తర్వాత అతడు జట్టతో చేరే అవకాశం ఉన్నది.



Next Story