ఆటో కాంపొనెంట్ ఇండస్ట్రీ ఆదాయం 16-18 శాతం వృద్ధి..

by  |
ఆటో కాంపొనెంట్ ఇండస్ట్రీ ఆదాయం 16-18 శాతం వృద్ధి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఒరిజినల్ పరికరాల తయారీ(ఓఈఎం) డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఆటో కాంపొనెంట్ పరిశ్రమపై తన దృక్పథాన్ని ప్రతికూలత నుంచి స్థిరత్వానికి మారుస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. అదేవిధంగా 2021, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆటో కాంపొనెంట్ పరిశ్రమ ఆదాయం 16-18 శాతం పెరుగుతుందని ఇక్రా అభిప్రాయపడింది. ఆటో కాంపొనెంట్ పరిశ్రమలో సెప్టెంబర్ నుంచి అన్ని విభాగాల్లో డిమాండ్ పెరిగింది.

ఆటోమోటివ్ పరిశ్రమ వాల్యూమ్‌ల పరంగా కరోనాకు ముందునాటి గరిష్ఠ స్థాయికి తిరిగి వచ్చేందుకు 2-3 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం ఓఈఎంలు, ఆటో కాంపొనెంట్ విక్రయదారులు ఎగుమతులే లక్ష్యంగా పెట్టుబడి ప్రణాళికలను పెంచుకునేందుకు ప్రోత్సహాన్నిస్తాయని ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మీడియా, హెవీ కమర్షియల్ వాహనాల డిమాండ్ తగ్గింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా టూ-వీలర్, ట్రాక్టర్లకు గ్రామీణ మార్కెట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ మద్దతుగా ఉందని పేర్కొంది.

Next Story