‘దిశ’ కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

by  |
park space
X

దిశ, జవహర్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన ‘మొక్కలను పీకేసి మరీ ఓ కౌన్సిలర్ పార్కు స్థలం కబ్జా’ చేయాలని చూస్తున్నాడని ‘దిశ’ దినపత్రికలో మంగళవారం ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ పార్కు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ్ భవనీనగర్ కాలనీలోని సర్వే నెంబర్ 22లో ఉన్న 170 గజాలు ఉంది. ఈ కథనంపై మంగళవారం మున్సిపల్ కమిషనర్ స్వామి స్పందించారు. ఈ విషయమై ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ.. మొక్కలు తొలగించిన విషయం తెలిసిన వెంటనే, పార్కులో మళ్లీ మొక్కలు నాటించామని స్పష్టం చేశారు. పార్కు స్థలాన్ని రోజూ తమ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములలో, పార్కులలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Next Story