శిథిలమవుతున్న వంతెన.. పట్టించుకోని అధికారులు

by  |
శిథిలమవుతున్న వంతెన.. పట్టించుకోని అధికారులు
X

దిశ, వేంసూరు: మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామం నుండి కేజీ మల్లెల వరకు ఉన్న 15 గ్రామాల ప్రజలకు ఆహార పంట పండించాలంటే నరక యాతన పడేవారు. వర్షాధారంతో పంట వేస్తే చేతికి వచ్చే అవకాశం వుండేది కాదు. అర్ధాకలితో అలమటించిన దుస్థితి ప్రజలది. అట్టి విషయాన్ని గమనించిన ఈ ప్రాంత వాసి, నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నాగార్జున సాగర్ (నందికొండ) కాలువ తవ్వించారు. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందేలా కృషి చేశారు. నాడు మండల పరిధిలోని యర్రసానివారి బంజరు, అడసర్లపాడు గ్రామాల మధ్య నిర్మితమైన ఆ నందికొండ కాలువపై ప్రజల రాకపోకల కోసం వంతెన నిర్మాణం చేశారు.

అనతి కాలంలో ఆ వంతెన మీదుగా 8 గ్రామాలకు ప్రయాణ మార్గంగా మారింది. కానీ నేడు అట్టి వంతెన పెచ్చులు ఊడి ఇనప సువ్వలు బయట పడి, శిథిలమౌతుంది. పట్టించుకున్నవారే లేకపోయే. ఆ వంతెన మీద ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతో పొంచి ఉంది. అదే విధంగా నాడు జలగం నిర్మించిన వంతెన నేడు శిథిలం అయిపోయింది. ఈ వంతెనపై తిరగడానికి ప్రయాణికులు, ప్రజలు భయపడుతున్నారు. పాలకులు, అధికారులు ఆ మార్గంలో ఎన్నో సార్లు ప్రయాణాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. మనకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాలకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి వంతెనకు మరమ్మత్తులు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed