తాగుబోతుల దేశంగా ఆ కంట్రీకి ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్‌!

by  |
Australia
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మద్యపానాన్ని దురలవాటుగా, వ్యసనంగా చూసేవారు గానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కల్చర్‌లో ఓ భాగమైపోయి, సోషల్‌గా మూవ్ అయ్యేందుకు వారధిగా మారిపోయింది. ప్రపంచ దేశాలన్నింటా ఈ కల్చర్ కొనసాగుతుండగా.. మద్యపానాన్ని అత్యంత ఇష్టపడే దేశమేదో తాజా సర్వే వెల్లడించింది. ఆశ్చర్యకరంగా కంగారూల దేశం ఆస్ట్రేలియా ఆ గౌరవాన్ని దక్కించుకుంది. 22 దేశాలకు చెందిన 32,000కు పైగా వ్యక్తుల ఇన్‌పుట్స్ ఆధారంగా గ్లోబల్ డ్రగ్ సర్వే 2021.. ఆస్ట్రేలియాను ప్రపంచంలోనే అత్యంత తాగుబోతు దేశంగా ప్రకటించింది.

ఈ వారం వెల్లడైన ఫలితాల ప్రకారం.. ఆస్ట్రేలియన్లు 2020లో సగటున 27 సార్లు తాగినట్లు తేలింది. ఇది ప్రపంచ సగటు 15 కంటే దాదాపు రెట్టింపు కాగా.. ఆసీస్ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, స్వీడన్ ఉన్నాయి. అక్కడ సంవత్సరానికి ఒక వ్యక్తి సగటున 23.8 సార్లు తాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ లెక్కన ఆస్ట్రేలియన్లు వారానికి సగటున రెండు రోజులు ఆల్కహాల్ సేవించారని సర్వే వెల్లడించింది. కాగా పాండమిక్ సిచ్యువేషన్ కూడా మద్యపాన విధానాలను అంతగా ప్రభావితం చేయలేదని దీని ద్వారా తెలుస్తోంది. అయితే ఆల్కహాల్ అమితంగా సేవించే టాప్ కంట్రీగా ర్యాంక్ పొందడంలో దేశంలోని మద్యపాన సంస్కృతులు కూడా ప్రముఖ పాత్ర పోషించి ఉండవచ్చని RMIT యూనివర్శిటీ పరిశోధకురాలు డాక్టర్ మోనికా బారట్ తెలిపారు.

అంతేకాదు ట్రాన్స్, నాన్-బైనరీ లేదా ఇంటర్‌సెక్స్ వ్యక్తులు ఎక్కువగా తాగే అవకాశం ఉందని, వారు ఏడాదికి సగటున 35 సార్లు తాగినట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ మొత్తం సంఖ్యలో పురుషులు 30 సార్లు, మహిళలు 21 సార్లు తాగినట్లు నివేదించింది. అయితే ఆస్ట్రేలియన్లలో తాగే రేటు ఎక్కువగా ఉన్నా.. తాగిన మొత్తం రోజుల సంఖ్య వాస్తవానికి ప్రపంచ సగటుకు దగ్గరగానే ఉందని డాక్టర్ బారట్ చెప్పారు. ఇక ఏడాదికి సగటున 132 గ్లాసులకు పైగా మద్యం సేవిస్తూ ఫ్రాన్స్ గ్లోబల్ చార్టులో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 122, ఆస్ట్రేలియా 106 డ్రింక్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఏడాదిలో ఎక్కువ రోజులు తాగే దేశంగా ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత తాగుబోతు దేశం అనే టైటిల్‌ గెలుచుకుంది.



Next Story

Most Viewed