భగ్గుమన్న బెంగాల్.. కేంద్రమంత్రి కాన్వాయ్‌పై అటాక్

by  |
భగ్గుమన్న బెంగాల్.. కేంద్రమంత్రి కాన్వాయ్‌పై అటాక్
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టీఎంసీ గూండాలు దాడులు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. హింసాత్మక ఘటనల వెనుక ఉన్నది బీజేపీయే అని మమతా బెనర్జీ చెప్పుకొస్తున్నారు. ఇటువంటి పరిణామాల దృష్ట్యా గురువారం బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి వి.మురళీధరన్ కాన్వాయ్‌పై పలువురు దుండగులు దాడి చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ దాడిలో కేంద్ర మంత్రి కాన్వాయ్ ధ్వంసం కాగా.. వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయి. దీంతో వి. మురళీధరన్ పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వచ్చారు.

ఇక ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ.. ‘వెస్ట్ మిడ్నాపూర్‌లో టీఎంసీ గూండాలు నా కాన్వాయ్‌పై దాడి చేశారు.. అద్దాలు పగులగొట్టారు.. పర్సనల్ సిబ్బందిపై కూడా దాడి చేశారు.. వెంటనే నా ట్రిప్‌ను రద్దు చేసుకున్నాను’ అంటూ దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం విచారణ కోసం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటన మీద ఏ విదంగా స్పందిస్తుందో అన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story