వచ్చే ఐదేళ్లలో రూ. 635 కోట్ల పెట్టుబడి: ఆథర్ ఎనర్జీ

by  |
వచ్చే ఐదేళ్లలో రూ. 635 కోట్ల పెట్టుబడి: ఆథర్ ఎనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ రాబోయే ఐదేళ్లలో రూ. 635 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి హోసూర్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థ బ్యాటరీ సహా 90 శాతం విడిభాగాల స్థానికీకరణను సాధించినట్టు ఆథర్ ఎనర్జీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 1.1 లక్షల స్కూటర్లు, 1.2 లక్షల బ్యాటరీలుగా ఉంది. ‘హోసూర్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించడం ఆథర్ ఎనర్జీకి కీలక మైలురాయి. వినియోగదారుల డిమాండ్ అనేక రెట్లు పెరిగింది.

అలాగే కొత్త మార్కెట్లకు సంస్థ విస్తరిస్తుండటం, అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా డిమాండ్‌ను తీర్చనున్నట్టు’ ఆథర్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ-వ్యవస్థాపకుడు తరు మెహతా చెప్పారు. ఎలక్త్రిక్ వాహనాల తయారీతో పాటు, లిథియం-అయాన్ బ్యాటరీ తయారీపై కూడా సంస్థ దృష్టి సారించనుంది. ఇది కంపెనీ ముందుకెళ్లేందుకు కీలకంగా మారుతుందని, అందుకే మరో ఐదేళ్లలో రూ. 635 కోట్ల పెట్టుబడులకు కేటాయిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ పెట్టుబడి వల్ల కొత్త ఉద్యోగాల సృహ్స్టి జరుగుతుందని, ఈ ఐదేళ్లలో 4 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ అభిప్రాయపడింది.



Next Story