గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: ఏఎస్పీ శబరీష్

by  |
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: ఏఎస్పీ శబరీష్
X

దిశ, మణుగూరు : మణుగూరు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మండలంలో అన్ని ప్రాంతాల నుంచి యువకులు వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. ఈ క్రీడాపోటీలకు ముఖ్యఅతిథిగా మణుగూరు ఏఎస్పీ పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి పగిడేరు టీం, రెండోవ బహుమతి కునవరం టీం, మూడోవ బహుమతి చేరువుముందు సింగారం టీమ్ లు అందుకున్నాయి. అనంతరం ఏఎస్పీ శబరిష్ మాట్లాడుతూ.. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమన్నారు. ముఖ్యంగా యువత క్రీడాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఈ వాలీబాల్ పోటీలను నిర్వహించమన్నారు.

క్రీడలు శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. యువత గంజాయి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. మండలంలో గంజాయి ఎవరైనా అమ్మకాలు జరిపితే పొలీస్ శాఖకు వెంటనే తెలియజేయాలని కోరారు. తెలియజేసిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ ముత్యం రమేష్, ఎస్ఐలు నరేష్, బట్టా పురుషోత్తం, కానిస్టేబుల్ కొప్పుల వెంకటేశ్వర్లు, ఏఎస్పీ, సీఐ పర్సనల్ సిబ్బంది, పీఈటిలు మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story