మావోయిస్టు పార్టీ కీలక నేత అరెస్ట్

by  |
మావోయిస్టు పార్టీ కీలక నేత అరెస్ట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్ ఘడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు క్రాంతికారీ జనతన్ సర్కార్ లో ఓ విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మావోయిస్టు పార్టీ నాయకున్ని అరెస్ట్ చేశారు. బీజాపూర్ జిల్లా బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 168 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్, 204 బెటాలియన్‌కు చెందిన కోబ్రా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సురనార్, మూలపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన ఈ బలగాలకు ముచాకి జోగా(35) చిక్కాడు. ఇతన్ని అదుపులోకి తీసుకున్న బలగాలు బీజాపూర్ కోర్టులో హాజరు పరిచారు. జోగా పలు కేసుల్లో నిందితుడని అతనిపై ఓ వారెంట్ కూడా పెండింగ్‌లో ఉందని బీజాపూర్ జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి.

Next Story

Most Viewed