‘అరణ్య’ అందరం గర్వపడే సినిమా : విక్టరీ వెంకటేశ్

by  |
‘అరణ్య’ అందరం గర్వపడే సినిమా : విక్టరీ వెంకటేశ్
X

దిశ, సినిమా : రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరణ్య’. ఈ చిత్రం హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, త‌మిళ్‌లో ‘కాదన్’ పేర్లతో ఈ నెల 26న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ యూనిట్ నిర్వహించిన చిట్‌చాట్‌‌లో విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, రచయిత సాయి మాధవ్ బుర్రా హాజరయ్యారు. రానా మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని చెప్పారు. ఇంట‌ర్‌నెట్‌, ప్రెస్ భాషా స‌రిహ‌ద్దుల‌ను పెద్ద స్థాయిలో తొలగించాయని ప్రశంసించారు.

థియేటర్లలో తమ ‘అరణ్య’ సినిమా మాట్లాడుతుందని డైరెక్టర్ ప్రభు సాల్మన్ వీడియో సందేశం ద్వారా తెలిపారు. ప్రకృతి, ఏనుగుల వంటి వాటిపై సినిమా తీసే క్రమంలో సపోర్ట్ చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు థాంక్స్ చెప్పారు. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ ప్రకృతితోనే అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయని, ప్రకృతి పట్ల అందరూ బాధ్యతగా ఉండాలన్నారు. యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడని, తన బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు చక్కగా సరిపోయిందని తెలిపారు. ‘లీడర్, ఘాజీ, బాహుబలి’ వంటి సినిమాల్లో విభన్నమైన పాత్రలు పోషించిన రానా..‘అరణ్య’ చిత్రంతో మనందరం గర్వపడేలా చేస్తాడన్న నమ్మకం తనకుందని చెప్పారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.



Next Story

Most Viewed