"ఆదాయం 104 కోట్లు.. వ్యయం 300 కోట్లు"

by  |
ఆదాయం 104 కోట్లు.. వ్యయం 300 కోట్లు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ను కరోనా వైరస్ వణికిస్తోంది. ఏ జిల్లాలో చూసిన రికార్డు స్థాయి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో పేరెన్నికగన్న కంపెనీలు కూడా ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. అలాంటి పరిస్థితుల్లో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు సంస్థ జీతాలు చెల్లించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ మార్చి 22న మూత పడింది. తిరిగి మే 21 న ఆరంభమైంది. అది కూడా స్వల్ప సర్వీసులతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడం ఆరంభించింది.

అదే సమయంలో కరోనా కాలంలో ప్రజలకు కార్గో సేవలందించింది. కూరగాయలు, విత్తనాలు, ఎరువులు, మందులు, నిత్యావసర వస్తువులు ఇలా అన్ని రకాల సమాన్లు గమ్య స్థానాలకు చేర్చింది. దీంతో లాక్‌డౌన్ అనంతరం సేవలు ప్రారంభించిన రెండు నెలల కాలంలో కేవలం 104 కోట్ల రూపాయల ఆదాయాన్ని మాత్రమే ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో ఏపీఎస్ ఆర్టీసీ 854 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ఈ లెక్కన చూస్తే ఏపీఎస్ ఆర్టీసీ రెండు నెలల కాలంలో 750 కోట్ల రూపాయల ఆదాయన్ని నష్టపోయింది.

ఆదాయం లేని పరిస్థితులత్లో ప్రతినెలా ఉద్యోగుల 300 కోట్ల రూపాయల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీతాల చెల్లింపుకు, సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం పెట్టకుండా ఏపీఎస్ ఆర్టీసీ జీతాలు చెల్లించింది. ఈ లెక్కన రెండు నెలలకు 600 కోట్ల రూపాయలు జీతాలు చెల్లించింది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోనే ఇది సాధ్యమైందని ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం జరిగి ఉండకపోతే ఎన్నో కార్మిక కుటుంబాలు రోడ్డున పడేవని వారు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed