మైనార్టీల ‘స్కిల్‌’కు శిక్షణ

by  |
మైనార్టీల ‘స్కిల్‌’కు శిక్షణ
X

దిశ, హైదరాబాద్:
నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో భాగంగా ఉచిత శిక్షణ కల్పించేందుకు అర్హులైన వారి నుంచి రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా దరఖాస్తులు కోరుతున్నారు. ముస్లిం, సిక్కు, జైన్స్, బుద్దిస్ట్స్, పార్శీ మతాలకు చెందిన, 18-35 సంవత్సరాల వయసుతోపాటు దారిద్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తుదారులకు 5వ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ తదితర అర్హతలను బట్టి రెండు, మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. మొత్తం 14 రకాల కోచింగ్ సంస్థలతో డిజిటల్ మార్కెటింగ్, ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్, ఆప్టికల్ పైబర్ సప్లయిర్, ఫినిషింగ్ స్కూల్ (జావా), హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్ విత్ లినిక్స్, యునిక్స్, ఓఎస్ అండ్ సర్వర్ అడ్మిన్, జీఎస్టీ, బ్యూటీషియన్, సీసీటీవీ, డిప్లొమా ఇన్ మల్టీమీడియా తదితర 50 రకాల అంశాల్లో నైపుణ్య శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 040-2324 0134 నెంబర్‌లో గానీ, నాంపల్లి హజ్ హౌస్, 6వ అంతస్తులోని కార్యాలయంలో గానీ సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఖాసీమ్ తెలిపారు.



Next Story

Most Viewed