శ్రమదానానికి అనుమతి నిరాకరణ.. తగ్గేదే లే అంటోన్న జనసేన

by  |
Janasena chief Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపరిస్థితిపై ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చిన జనసేన పార్టీ.. స్పందించకుంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర జనసేనాని పవన్ కల్యాణ్ రోడ్లకు మరమ్మత్తులు చేయనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జనసేనకు ఏపీ ఇరిగేషన్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. కాటన్ బ్యారేజీ దగ్గర జనసేనాని శ్రమదాన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.

కాటన్ బ్యారేజీ ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రాదని ఇరిగేషన్ ఎస్ఈ స్పష్టం చేశారు. కేవలం ప్రజల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి స్పందించిన జనసేన, కార్యక్రమాన్ని జరిపి తీరుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పవన్ శ్రమదానం కోసం ముమ్మర ఏర్పాట్లు ప్రారంభించారు.

Next Story

Most Viewed