ఆ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న హోం మంత్రి.. ఎందుకంటే ?

by  |
sucharitha
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. రమ్య కుటుంబాన్ని శనివారం హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఐదు సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను సుచరిత అందజేశారు. హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరిధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఉన్నారు. అనంతరం హోంశాఖమంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్య కుటుంబ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారని.. రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పుకొచ్చారు.

రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు సుచరిత వెల్లడించారు. మరోవైపు మేడికొండూరు మండలం పాలడుగులోని మహిళపై గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసు విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. పోలీసులకు ఆధారాలు దొరికాయని..త్వరలోనే నిందితులను పట్టుకుంటారని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed