జగన్ సంచలన నిర్ణయం.. వారికే మేలు

by  |
జగన్ సంచలన నిర్ణయం.. వారికే మేలు
X

దిశ,ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్లపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తోందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసింది.

ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు మేలు జరిగేలా కుటుంబ వార్షికాదాయం రూ. 8లక్షల లోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తింపు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితి రూ.6లక్షల నుంచి రూ. 8లక్షలకు పెంచింది. గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రభుత్వం మెమో జారీ చేసింది. రాష్ట్రంలోని తహశీల్దార్‌ కార్యాలయాలకు మెమో ద్వారా అధికారిక సమాచారం వెళ్లినట్లు తెలుస్తుంది. రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ప్రభుత్వం ఆ మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story